తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్న ఆకునూరి మురళికి ఘనస్వాగతం

812చూసినవారు
తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్న ఆకునూరి మురళికి ఘనస్వాగతం
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ సలహాదారు పదవికి రాజీనామా చేసి.. తెలంగాణలో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తున్న ఆకునూరి మురళికి నల్గోండ జిల్లా నార్కెట్ పల్లిలో వలిగొండ యువకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆకునూరి మురళి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు.. ఇప్పుడున్న పాలకులు విద్య, వైద్యం నుంచి దూరం చేసారని అందుకే ఆవేదన చెంది.. రాజకీయాల్లోకి వస్తున్నామన్నారు. ప్రజలకు విద్య, వైద్యం అవినీతి లేని తెలంగాణ చూడటమే తమ లక్ష్యం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రాంతిదాల్ వ్యవస్థాపక అధ్యక్షులు పృథ్వీరాజ్ యాదవ్ జక్కల మత్స్యగిరి నవీన్, ఎల్తురి సాగర్ వంశీ తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్