నకిరేకల్ మండలం - Nakrekal Mandal

ఘనంగా పంద్రాగస్టు వేడుక

ఘనంగా పంద్రాగస్టు వేడుక

నకరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 74వ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యనివాహక కార్యదర్శి దైధ రవీందర్ హాజరయ్యి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం మాట్లాడుతూ..ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధుల కృషి ఫలితం మనకు దక్కిన ఈ స్వేచ్ఛ స్వాతంత్య్ర జీవితాన్ని అందించిన వారికి మనం ఎంతో రుణపడి ఉంటాం కావున భవిష్యత్తు తరాలకు వారి అడుజాడలో నడిచేలా చేసి వారికి అన్ని విధాలుగా సమాన హక్కుల కల్పనకు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పన్నాల రంగమ్మరాఘవ రెడ్డి, బొడ్డు నాగరాజు, గంధమల్ల జానయ్య గౌడ్, జైపాల్ రెడ్డి, యూసుఫ్, బూత్కూరి వెంకట్ రెడ్డి, రాంప్రసాద్, అఖిల్, రియాజ్ ఖాన్, సతీష్, పరమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లా
ఎమ్మెల్యే రాజాసింగ్‌ను తొక్కేస్తున్న బీజేపీ నేత ఎవ‌రు?
Nov 18, 2024, 17:11 IST/

ఎమ్మెల్యే రాజాసింగ్‌ను తొక్కేస్తున్న బీజేపీ నేత ఎవ‌రు?

Nov 18, 2024, 17:11 IST
బీజేపీ త‌ర‌పున‌ హైద‌రాబాద్‌లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అయిన రాజాసింగ్‌కు ఇప్పుడు సొంత పార్టీలోనే అవ‌మాన‌క‌ర‌మైన ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నార‌ని ఆయ‌న ఫాలోవ‌ర్స్ వాపోతున్నారు. తాజాగా బీజేపీ మూసీ బాధితుల‌కు అండ‌గా ఉండేందుకు బ‌స్తీ నిద్ర ప్రోగ్రాం కార్యాచరణను మొద‌లుపెట్టింది. అయితే ఇందులో పాల్గొనేందుకు రాజాసింగ్ పేరును బీజేపీ చేర్చ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. బీజేపీలో కీల‌క నేత, ఢిల్లీ స్థాయికి చేరిన ఓ నాయ‌కుడికి రాజాసింగ్ అంటే న‌చ్చ‌క‌పోవడం వ‌ల్లే ఇలా జ‌రుగుతోంద‌ని ఆరోపిస్తున్నారు.