కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. స్థానిక దొడ్డి కొమురయ్య భవన్ లో బుధవారం ఐద్వా నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకు 2500 రూపాయల నగదును 9 నెలలు అవుతున్నా నేటికీ అమలు చేయలేదని అన్నారు.