గత 16 సంవత్సరాలుగా పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం నిరవధిక సమ్మెలో భాగంగా 14వ రోజు నల్గొండ కలెక్టరేట్ ఎదుట మూడేళ్ల చిన్నారి కావాలి కావాలి రెగ్యులేషన్ కావాలని నినాదాలతో ఎంతో మందిని ఆకర్షించింది. ప్రభుత్వం రెండవ ఏఎన్ఎంల
నోటిఫికేషన్ రద్దుచేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో సమ్మె ఉధృతం చేస్తామని రెండవ ఏఎన్ఎంలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.