సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న వారిని ఆదర్శంగా తీసుకుని కష్టపడి చదివి సమాజానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థులకు సూచించారు. శనివారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న అల్పసంఖ్యాక వర్గాల బాలికల రెసిడెన్షియల్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడి వారి విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించారు. డిస్కోర్స్ అంటే ఏంటి? అని ప్రశ్నించారు.