దామరచర్లలో కూరగాయల పంపిణీ

351చూసినవారు
దామరచర్లలో కూరగాయల పంపిణీ
దామరచర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో కూరగాయలు, బియ్యం పంపిణీ చేశారు. కరోనా వ్యాధి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండి సామాజిక దూరం పాటిస్తూ, వైద్యుల సలహాలు పాటించి జాగ్రత్తగా ఉండాలని కోరారు. కొంత మంది పేదలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బంటు కిరణ్, గాజుల శ్రీనివాస్, చంద్ర శేఖర్ యాదవ్, డాక్టర్ సదానందం, నరసింహారెడ్డి, కాసిం, ఓర్సు వెంకటేశ్వర్లు, సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్