నల్లగొండ జిల్లా కనగల్ మండల శుశ్రుత గ్రామీణ వైద్యుల నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పొనుగోటి హనుమంతరావు హాజరై నూతన కమిటీ ఎన్నిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా కనగల్ మండల శుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం నూతన అధ్యక్షుడిగా నకిరేకంటి యాదగిరి గౌడ్, మండల ప్రధాన కార్యదర్శిగా పగడాల దశరథ, కోశాధికారిగా పడగోజు నాగార్జున చారి ఎన్నికైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బొల్లెపల్లి శ్రీనివాస్ రాజు, డివిజన్ అధ్యక్షుడు ఆమనగంటి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.