నల్గొండ: దేశ సమైక్యత, భద్రతలకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి

50చూసినవారు
నల్గొండ: దేశ సమైక్యత, భద్రతలకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి
దేశ సమైక్యత, భద్రతలకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ త్రిపాఠి అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న జాతీయ ఐక్యత దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా గురువారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్