డ్వాబ్ చే నిర్వహించబడుతున్న నల్లగొండ అంధుల పాఠశాలలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో త్రివర్ణ పతాకాన్ని ఆర్. రామారావు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఇద్దరు విద్యార్థులకు వూరె నరసింహారావు, ఐఏఎస్, లక్ష్మీబాయిల జ్ఞాపకార్థం వారి కూతురు మాలతి అల్లుడు శేషాచలం ఇద్దరు విద్యార్థులకు మెమొంటోలు, 1100/-రూపాయల నగదును వూరె నరసింహారావు సోదరుడు శ్రీ వూరె ప్రకాష్ రావు చేతుల మీదగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కంచనపల్లి రవీందర్ రావు పాల్గొన్నారు. అదేవిధంగా శంకరప్ప కుమార్తె మహాన్విత పుట్టినరోజు సందర్భంగా పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసి 11116/- విరాళం అందించడం జరిగింది. వీరిని ఆదర్శంగా తీసుకొని దాతలు ముందుకు రావాలని డ్వాబ్ విజ్ఞప్తి చేస్తోంది. ఈ కార్యక్రమంలో డ్వాబ్ ప్రధాన కార్యదర్శి ఎఐసిబి కార్యదర్శి పొనుగోటి చొక్కారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.