నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ తండ్రి కనిలాల్ నాయక్ అనారోగ్యం కారణంగా ఇటీవలే మరణించారు. బుధవారం వారి కుటుంబాన్ని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పరామర్శించి కనిలాల్ చిత్ర పటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.