నూతన భవనానికి మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన

64చూసినవారు
నూతన భవనానికి మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన
నల్గొండ పట్టణంలోని పానగల్ రోడ్ లో నూతనంగా నిర్మించబోయే బాలసదన్, వయోవృద్ధుల వసతి గృహానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దాసరి హరిచందన, జాయింట్ కలెక్టర్ కేశవ్ పాటిల్, మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్