ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారుల సమ్మిళిత సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లా డివిజన్ల పరిధిలోకి వచ్చే ఫిర్యాదులకు సంబంధించిన పరిష్కారం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు.