సిపిఎం అఖిలభారత కార్యదర్శి సీతారామ్ ఏచూరి మరణం కమ్యూనిస్టులకు తీరని లోటు అని సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం అఖిలభారత కార్యదర్శి ఉత్తమ పార్లమెంటేరియన్ కామ్రేడ్ సీతారామ్ ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ వారి మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు.