నాంపల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి
నాంపల్లి మండలం పసునూరు గ్రామానికి చెందిన రాపోతు సందీప్(21) ఈ నెల 12 వ తేదీన దసరా పండుగ సందర్భంగా చింతపల్లి మండల పరిధిలోని నిల్వల పల్లి గ్రామంలో తన స్నేహితులను కలిసి తిరిగి వెళ్తుండగా గ్రామ శివారులో బైక్ అదుపు తప్పి సందీప్ తలకు తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు అని ఎస్సై యాదయ్య శనివారం తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.