మద్దిరాల: ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన సీఐ శ్రీను
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఆదివారం మద్దిరాల ధాన్యం కొనుగోలు కేంద్రాలను తుంగతుర్తి సిఐ శ్రీను నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మద్దిరాల ఎమ్మార్వో, ఎస్ఐ, ఏఈఓ, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, నిర్వాహకులు పాల్గొన్నారు.