వెంపటి గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
తెలంగాణలో గత మూడు రోజులుగా ఏడ తెరపలేకుండా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూర్యాపేట జిల్లా వెంపటి గ్రామంలోని రెండు చెరువులు నిండు కుండలా తలపిస్తున్నాయని గ్రామ అధికారులు తెలిపారు. కాగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే శిథిలావస్థలో ఏమైనా ఇళ్లు ఉంటే మీ దగ్గరలో ఉన్న కమ్యూనిటీ హాల్, గవర్నమెంట్ బిల్డింగ్స్ లో వెళ్లి పునరావాసం ఏర్పరచుకోవాలని సూచించారు. ప్రజల సహాయార్థం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారన్నారు. ఫోన్ నెంబర్: 6281492368, వెంపటి గ్రామపంచాయతీ కార్యదర్శి ఫోన్ నెంబర్: 9676882109.