దుకాణాల్లో నేమ్‌ప్లేట్లు.. మాజీ సీఎం ముఫ్తీ ఫైర్

64చూసినవారు
దుకాణాల్లో నేమ్‌ప్లేట్లు.. మాజీ సీఎం ముఫ్తీ ఫైర్
యూపీలోని బీజేపీ పాలిత ప్రభుత్వంపై జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఫైర్ అయ్యారు. శ్రీనగర్‌లోని ఆదివారం మీడియాతో మాట్లాడారు. కన్వర్ యాత్ర మార్గంలో అన్ని రెస్టారెంట్లు, దుకాణాల వెలుపల యజమానుల పేర్లను ప్రదర్శించాలనే ప్రభుత్వ ఆదేశాలను తప్పుబట్టారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా ఆమె అభివర్ణించారు. ముస్లిములు, దళితులు, బీసీ వర్గాల హక్కులను అంతం చేయాలని బీజేపీ చూస్తోందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్