అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి నటించిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా ‘తండేల్’ ఫిబ్రవరి 7న విడుదలయింది. ఈ చిత్రం నాగచైతన్య కెరీర్‌లో మంచి విజయంగా నిలిచింది. తాజాగా మహా శివరాత్రిని పురస్కరించుకుని ఈ సినిమాలోని శివుడి పాట ‘నమో నమః శివాయ’ ఫుల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో నాగచైతన్య-సాయిపల్లవి డ్యాన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.