సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో యాజమాన్యం A1, A2 గా ఉన్న విషయం తెలిసిందే. దీంతో యాజమాన్యం నాంపల్లి కోర్టులో నేడు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని చిక్కడపల్లి పోలీసులను న్యాయస్థానం ఆదేశించగా.. వారు గంట సమయం కావాలని కోరారు. పోలీసులు కౌంటర్ దాఖలు చేసినంతరం యజమానుల తరపు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు. దీంతో ఎలాంటి తీర్పు వస్తుందోనని వారిలో ఉత్కంఠత నెలకొంది.