బర్డ్‌ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ సరిహద్దుల్లో 24 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను అధికారులు వెనక్కి పంపుతున్నారు. రాష్ట్రంలో కొన్ని రోజులు చికెన్ తినవద్దని, జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.