జడ్చర్ల నియోజకవర్గం
బీసీల హక్కుల కోసం ఉద్యమిద్దాం: దోరేపల్లి రవీందర్
రాజకీయంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు బీసీలు యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందని, రాష్ట్ర జనాభాలో అధిక శాతంగా ఉన్న బీసీలు రాజకీయాలలో రాణించాలని, రాజ్యాంగం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఉద్యమకారుడు, జడ్చర్ల బీసీల ముద్దుబిడ్డ దోరేపల్లి రవీందర్ శుక్రవారం అన్నారు. బీసీలు రాజకీయంగా ఎదగాలనే అంశం పట్ల ప్రతి ఒక్క బీసీ సోదరుడు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.