అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామానికి చెందిన బి నాగమ్మ అనారోగ్యంతో మరణించారు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే విజయుడు శుక్రవారం అక్కడికి వెళ్లడం జరిగినది. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.