వనపర్తి
వనపర్తి జిల్లా కేంద్రంలో కుక్కల బెడద
వనపర్తి జిల్లా కేంద్రంలోని నంది హిల్స్, జంగిడిపురం తదితర చోట్ల కుక్కల బెడద ఎక్కువగా ఉందని, అరికట్టాలని కాలనీల ప్రజలు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. కుక్కల గుంపులు ఇళ్ల మధ్య సంచరిస్తున్నాయని, ఎక్కడ దాడి చేస్తాయో అన్న భయం పెద్దలు పిల్లల్లో ఉందన్నారు. నంది హిల్స్ మహిళా డిగ్రీ కాలేజీ వద్ద కుక్కల గుంపును చూసి భయపడిన ఓ బాలిక తోడు వచ్చి దాటించాలని తనను కోరిందని కాలనీవాసి రాజనగరం సింగిల్ విండో ఛైర్మన్ తెలిపారు.