ఆరోగ్యకరమైన వాతావరణానికి ప్రకృతి పునాది అని.. ప్రకృతి పరిరక్షణ దినోత్సవం గుర్తించింది. ప్రస్తుత, భవిష్యత్ తరాలను కాపాడటానికి ప్రకృతిని పరిరక్షించడం అవసరం. అటవీ నిర్మూలన, అక్రమ వన్యప్రాణుల వ్యాపారం, కాలుష్యం, ప్లాస్టిక్‌లు, రసాయనాలు వాడటం వంటి పనుల వలన ఈ ప్రకృతికి హాని కలుగుతుంది. నీరు, గాలి, నేల, ఖనిజాలు, చెట్లు, జంతువులు, ఆహారం మొదలైనవి జీవించడానికి భూమి ప్రాథమిక అవసరాలను అందిస్తుంది కాబట్టి ఈ ప్రకృతిని ప్రతి ఒక్కరూ కాపాడాలి.