హెచ్ఐవీ నిర్మూలనకు సూది మందు.. పరీక్షలు విజయవంతం!

54చూసినవారు
హెచ్ఐవీ నిర్మూలనకు సూది మందు.. పరీక్షలు విజయవంతం!
హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్‌ నుంచి మనుషులను కాపాడేందుకు తయారు చేసిన సూది మందు పరీక్షలు విజయవంతమయ్యాయి. దక్షిణాఫ్రికా, ఉగాండాలలో నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్‌ సత్ఫలితాలను చూపించాయి. లెనకపవిర్‌ ఇంజెక్షన్‌ (lenacapavir injection) ను ఆరు నెలలకు ఒకసారి చొప్పున, ఏడాదికి రెండుసార్లు ఇవ్వడంవల్ల యువతను హెచ్‌ఐవీ నుంచి కాపాడవచ్చని ఈ పరీక్షల్లో స్పష్టమైంది. ఈ ఇంజెక్షన్‌ను అందరికీ అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు గిలీడ్‌ సైన్సెస్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

సంబంధిత పోస్ట్