పారిస్ ఒలింపిక్స్ బరిలోకి దిగిన నీరజ్ చోప్రా తాను వేసిన తొలి త్రోతోనే గోల్డ్ మెడల్ గురించి తాను ఎంత సిద్ధంగా ఉన్నాడో నిరూపించాడు. ఫైనల్ వెళ్లాలంటే 84 మీటర్ల కంటే ఎక్కువ దూరం విసరాల్సి ఉండగా.. నీరజ్ చాలా సులువుగా ఆ మార్క్ దాటేశాడు. క్వాలిఫికేషన్ రౌండ్ తొలి ప్రయత్నంలోనే నీరజ్ ఏకంగా 89.34 మీటర్ల దూరం విసిరి ఫైనల్ కు అర్హత సాధించాడు. జావెలిన్ త్రోలో అత్యంత దూరం విసిరిన అథ్లెట్ గా రికార్డు సృష్టించాడు.