టెలికాం యూజర్లకు కేంద్రం కీలక సూచన చేసింది. ప్రభుత్వ అధికారులమంటూ ప్రజలను సైబర్ నేరగాళ్లు మోసగిస్తున్న వేళ గుర్తు తెలియని ఇంటెర్నేషనల్ నంబర్ల నుంచి వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. టెలికాం ఆపరేటర్లు సైతం ఇంటెర్నేషనల్ కాల్ అని సూచించి వినియోగదారులకు అవగాహన కల్పించాలని పేర్కొంది. కాబట్టి +91 కాకుండా వేరే కోడ్‌లతో వచ్చే ఇంటెర్నేషనల్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.