రెండు రోజుల్లోగా నీట్‌ తుది ఫలితాలు

61చూసినవారు
రెండు రోజుల్లోగా నీట్‌ తుది ఫలితాలు
నీట్ తుది ఫలితాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కీలక ప్రకటన చేశారు. రెండు రోజుల్లోగా నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఫలితాలను విడుదల చేస్తుందని వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. ఈ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదంటూ సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్