NEET కూడా రద్దు చేయాలి: ఖర్గే

85చూసినవారు
NEET కూడా రద్దు చేయాలి: ఖర్గే
పేపర్ లీక్, పరీక్షలో అవకతవకల కారణంగా UGC-NET పరీక్షను కేంద్రం బుధవారం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన NEET పరీక్షను కూడా రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 'UGC-NET పరీక్ష రద్దు విద్యార్థుల విజయం. అహంకార పూరిత మోడీ ప్రభుత్వానికి ఇది పరాభవం. మోడీజీ.. NEET పరీక్ష పేపర్ లీకేజీకి మీరే బాధ్యత వహించాలి' అని ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్