సంక్రాంతి నుంచి అమలు చేయాలని భావిస్తున్న ‘రైతు భరోసా’ కోసం రైతుల నుంచి కొత్తగా దరఖాస్తులు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించి అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. సాగు చేసే రైతులందరికీ సాయం అందించాలని నిర్ణయించినట్లు తెలిసింది. శనివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ‘రైతు భరోసా’కు, కేబినెట్ కమిటీ సిఫారసులకు ఆమోదముద్ర వేయనున్నారు.