NEW YEAR రాశిఫలాలు (2024)

200612చూసినవారు
NEW YEAR రాశిఫలాలు (2024)
మేష రాశి ఈ రాశి వారు అంగారకుడి ప్రభావం కారణంగా ధైర్యంగా ఉంటారు. కొత్త ఏడాదిలో అందంగా, ఆకర్షణీయంగా, కళాత్మకంగా ఉంటారు. వీరు స్వతంత్ర ఆలోచనాపరులు కూడా. వీరు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు. మీరు ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. కొత్త ఏడాదిలో వ్యక్తిగత జీవితంలో అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. ఈ రాశి నుంచి శని ఏడో స్థానంలో సంచారం చేయనున్నాడు. విద్యార్థులకు లాభదాయకంగా ఉంటుంది. తమ కష్టానికి తగిన ఫలాలను తప్పకుండా పొందుతారు. విద్యార్థులు కొత్త ఏడాదిలో విదేశీ విద్య కోసం విదేశాలకు వెళ్లొచ్చు. మిధున రాశి ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. కొత్త ఏడాదిలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. కొన్ని సందర్భాల్లో శుభ ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగులు ఉద్యోగాలు మారేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. మీరు వ్యాపార రంగాల్లో పెట్టుబడి పెట్టొచ్చు. విద్యార్థులకు కొత్త ఏడాదిలో లాభదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి ఈ రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. కొత్త ఏడాదిలో గొప్ప ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రేమ జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. కొత్త ఏడాదిలో పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు మంచి ఫలితాలను పొందొచ్చు. మీ కుటుంబం, వైవాహిక జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీ పరిస్థితులన్నీ నియంత్రణలో ఉంటాయి. సింహ రాశి ఈ రాశి వారు కొత్త ఏడాదిలో ప్రత్యేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. అయితే మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ మీ తెలివితేటలతో అన్ని సమస్యలను అధిగమిస్తారు. సన్నిహితుల ప్రవర్తన చూసి మీరు బాధపడొచ్చు. రెండో భాగంలో ఈ రాశి వారు అద్భుతమైన ఫలితాలను పొందనున్నారు. మీ కుటుంబ జీవితంలో బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి కొత్త ఆస్తిని కొనుగోలు చేయొచ్చు. 2024 సంవత్సరంలో విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు రావొచ్చు. కన్య రాశి ఈ రాశి వారు కొత్త ఏడాదిలో ఆర్థిక పరమైన రంగాల్లో మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారికి 2024లో చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ ఆరోగ్యం క్షీణించొచ్చు. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వ్యాపారులకు మంచి ఫలితాలొస్తాయి. అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీ ఖర్చులను నియంత్రణలో ఉంచాలి. మీ తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ కుటుంబ అవసరాలను తీర్చగలుగుతారు. తులా రాశి ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో కుటుంబంలో సంతోషంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా నూతన సంవత్సరంలో అనుకూలంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో మెరుగైన ఫలితాలొస్తాయి. ఉద్యోగులు ప్రమోషన్ పొందొచ్చు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి ఈ రాశి వారికి గురువు అధిపతిగా ఉంటాడు. కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి గ్రహాల ప్రభావంతో శుభ ఫలితాలొస్తాయి. ఈ కాలంలో మీరు జీవితంలో అన్ని రంగాల్లో గొప్ప విజయాలు సాధిస్తారు. శని దేవుని నుంచి కొన్ని సమస్యలు ఉండొచ్చు. అయితే మీరు చింతించాల్సిన పనిలేదు. మీ కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. మీ కుటుంబ సభ్యులలో అవివాహితులకు వివాహం జరగొచ్చు. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలొస్తాయి. ధనస్సు రాశి ఈ రాశి వారికి గురువు అధిపతిగా ఉంటాడు. కొత్త ఏడాదిలో ఈ రాశి నుంచి శని దేవుడు 12వ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలొస్తాయి. ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఈ కాలంలో మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు నిపుణుల సలహాలను తప్పకుండా తీసుకోవాలి. మీ కుటుంబంలో శాంతి, ఆనందం ఉండకపోవచ్చు. ఈ కారణంగా మీ ఆరోగ్యం కూడా క్షీణించొచ్చు. మీ ప్రేమ జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ ఏడాది బాగానే ఉంటుంది. మకర రాశి ఈ రాశి వారికి శని దేవుడు అధిపతిగా ఉంటాడు. కొత్త ఏడాది ప్రారంభంలో ఈ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. మీ కుటుంబంలో శాంతి నెలకొంటుంది. మీ కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది. మీరు ప్రేమ వివాహం చేసుకునేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కుంభ రాశి ఈ రాశి వారికి కూడా శని దేవుడు అధిపతిగా ఉంటాడు. కొత్త ఏడాదిలో వీరికి మిశ్రమ ఫలితాలొస్తాయి. మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఈ కారణంగా వారి చుట్టూ ఎక్కువ సమయం తిరగాల్సి వస్తుంది. 2024లో ఎలాంటి చర్చల విషయంలో అయినా దూరంగా ఉండాలి. ఎందుకంటే కొన్ని కోర్టు సమస్యలు మిమ్మల్ని ఆందోళనకు గురి చేయొచ్చు. మీ ప్రేమ జీవితంలో సంతోషకరంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. మీన రాశి ఈ రాశి వారికి గురువు అధిపతిగా ఉంటాడు. కొత్త ఏడాదిలో మీన రాశి వారికి ప్రారంభంలో కొంత ప్రతికూలంగా ఉంటుంది. కొత్తగా పెళ్లయిన దంపతులు కొన్ని శుభవార్తలను వింటారు. మీ కుటుంబంలో శుభకార్యాలను నిర్వహించే అవకాశం ఉంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాహనాలను చాలా జాగ్రత్తగా నడపాలి. మీ ప్రేమ జీవితంలో బాగుంటుంది. మీ వైవాహిక జీవితంలో కొంత ఊరట ఉండొచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. మరోవైపు రెండో భాగంలో కొన్ని సమస్యలు తలెత్తొచ్చు.

సంబంధిత పోస్ట్