న్యూ ఇయర్ -2025 సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. రాష్ట్రంలోని వేములవాడ రాజన్న, కాళేశ్వరం, ధర్మపురి, బాసర సరస్వతి, కొండగట్టు, కొమురవెల్లి, వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, రామప్ప, ఐనవోల్ మల్లన్న, భద్రాచలం, యాదగిరి గుట్ట, స్వర్ణగిరి దేవాలయాల్లో దైవ దర్శనానికి భక్తులు బారులు తీరారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల కిటకిటతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది.