కేరళలోని పయ్యోలిలో దారుణం చోటుచేసుకుంది. లా రెండో సంవత్సరం చదువుతున్న నవ వధువు బాత్‌రూమ్‌లో కిటికీకి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన భర్త తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 2న తమకు పెళ్లైందని, తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని అన్నారు. అయితే స్నానానికి వెళ్లి గంటైనా రాకపోవడంతో వెళ్లి చూడగా.. కిటికీకి వేళాడుతోందని పోలీసులకు చెప్పారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.