గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
బైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టులో గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ప్రాజెక్టులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు 40 సంవత్సరాలు ఉంటుందని నల్ల రంగు ప్యాంటు, లేత గులాబీ చొక్కా ధరించి ఉన్నాడని తెలిపారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.