అన్నపూర్ణ యోజన అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2000న ప్రవేశపెట్టింది. ఈ పథకం కేవలం ఫుడ్ క్యాటరింగ్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే ఔత్సాహిక మహిళల కోసమే మాత్రమే. దీని ద్వారా రుణం రూపంలో రూ. 50,000 పొందవచ్చు. ఈ రుణం ద్వారా వంట పరికరాలు, ఫ్రిజ్, గ్యాస్ కనెక్షన్, డైనింగ్ టేబుల్స్ కొనుగోలు చేయవచ్చు. ఈ లోన్ యొక్క వడ్డీ రేట్లు మార్కెట్‌ను బట్టి మారుతూ ఉంటుంది. రుణం మొత్తాన్ని మూడేళ్ల లోపు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లోన్ పొందడానికి SBI బ్రాంచ్ని సంప్రదించవచ్చు.