వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు

71చూసినవారు
జన్నారం పట్టణ శివారులోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న జన్నారం వాగు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు జన్నారం మండలంలో అతి భారీ వర్షం పడింది. దీంతో ఎగువ ప్రాంతాలతో పాటు స్థానిక వాగుల్లో వరద నీరు రావడంతో జన్నారం వాగులో వరద ఉధృతి పెరిగింది. దీంతో స్థానికులు కొంత ఆందోళన చెందుతున్నారు. వాగు సమీపంలో ఉండే వివిధ కాలనీల ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్