ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలి

85చూసినవారు
ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలి
ఖానాపూర్ నియోజకవర్గంలో సాంకేతిక విద్యను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరారు. నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన విద్యార్థులు ఇతర ప్రాంతాలలో బిఈ, బిటెక్, ఎంటెక్ లాంటి ఇంజనీరింగ్ కోర్సులను చదువుతున్నారు. నియోజకవర్గంలో ఎక్కువగా మధ్య తరగతి రైతు కుటుంబాలే ఉన్నాయి. ఖానాపూర్ లో ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తే ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్