మురిపించి ముఖం చాటేస్తున్న మబ్బులు

78చూసినవారు
మురిపించి ముఖం చాటేస్తున్న మబ్బులు
ఖానాపూర్ నియోజకవర్గంలోని ఎండల తీవ్రత కొనసాగుతోంది. సోమవారం సా. ఐదు గంటలకు పలు మండలాల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయిందని అధికారులు తెలిపారు. మృగశిర కార్తె వచ్చి వర్షాకాలం ప్రారంభమైన ఇంతవరకు వర్షాల జాడ కనిపించలేదు. వర్షాలు పడితేనే ఎండ తీవ్రత తగ్గుతుందని అధికారులు వెల్లడించారు. రాబోయే మూడు రోజులపాటు తేలిక పాటి జల్లులు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్