జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

76చూసినవారు
జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
జైనూర్ మండల ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన జైనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ప్రజలకు, రోగులకు అందుతున్న వైద్య సేవలు గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మండల ప్రజలకు మంచి వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్