కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులు బుధవారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 694 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 18 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరగా లెఫ్ట్ కెనాల్ ద్వారా ఆయకట్టు రైతులకు 304, రైట్ కెనాల్ కు 5, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.