దేవాలయంలో భక్తుల పూజలు

69చూసినవారు
ఉట్నూరు మండలంలోని సాలెవాడ గ్రామంలో ఉన్న శ్రీ మహాదేవ్ దేవాలయంలో ఉన్న స్వామివారికి ఇంద్రవెల్లి మండల భక్తులు జలాభిషేకం చేశారు. శ్రావణమాసం శనివారం సందర్భంగా ఇంద్రవెల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన భక్తులు కావడిలో పవిత్ర జలాన్ని తీసుకు వచ్చారు. అనంతరం దేవాలయంలో ఉన్న మహాదేవ్ కు వారు జలాభిషేకం చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్