గుంతలమయంగా మారిన రోడ్లతో ఇబ్బందులు

81చూసినవారు
గుంతలమయంగా మారిన రోడ్లతో ఇబ్బందులు
జన్నారం మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లే ప్రధాన రోడ్లు గుంతల మయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జన్నారం పట్టణం నుండి కవ్వాల్ గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు చాలా చోట్ల గుంతల మయంగా మారింది. వర్షాలు పడినప్పుడు ఆ గుంతలలో నీరు నిలిచి ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు. అలాగే చింతలపల్లికి వెళ్లే రోడ్డు కూడా బురదమయంగా మారింది. ఆయా రోడ్లకు మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరారు.

సంబంధిత పోస్ట్