కడెం ప్రాజెక్టు పరిసరాలలోకి వెళ్ళవద్దు

77చూసినవారు
కడెం ప్రాజెక్టు పరిసరాలలోకి వెళ్ళవద్దు
కడెం ప్రాజెక్టు పరిసరాలలోకి ఎవరు వెళ్ళవద్దని ఆ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విటల్ కోరారు. కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కడెం ప్రాజెక్టు పరిసరాలలోకి పశుకాపర్లు, ప్రజలు, పశువులు వెళ్ళనీయకుండా చూడాలని ఆయన కోరారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి సహకరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్