ఈద్గా పరిసరాలు పరిశుభ్రం

551చూసినవారు
ఈద్గా పరిసరాలు పరిశుభ్రం
జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ శివారులో ఉన్న ఈద్గా పరిసరాలను పంచాయతీ అధికారులు, సిబ్బంది శుభ్రం చేయిస్తున్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని అధికారుల ఆదేశాల మేరకు సోమవారం ఉదయం గ్రామపంచాయతీ ఈవో రాహుల్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు ఈద్గా వద్ద పెరిగిన పిచ్చి మొక్కలు, చెట్లను తొలగించి ఊరు శివారుకు తరలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో రాహుల్, కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్