కబ్జాకు గురైన చెరువు భూములను స్వాధీనం చేసుకోవాలి

85చూసినవారు
జన్నారం మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో కబ్జాకు గురైన చెరువు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జన్నారం మండల అధ్యక్షుడు ముజాఫర్ అలీఖాన్ అన్నారు. శుక్రవారం జన్నారంలో మీడియాతో మాట్లాడారు. కబ్జాకు గురికాని చెరువులను గుర్తించి వాటి చుట్టూ కంచెలు నిర్మించాలని చెరువులు కబ్జాకు గురికాకుండా చూడాలని సీఎంకు కోరుతున్నామన్నారు. దీనిపై తహశీల్దార్, కలెక్టర్లకు దరఖాస్తులు ఇస్తామన్నారు.

సంబంధిత పోస్ట్