ఆరోగ్య సలహాలను తప్పకుండా పాటించాలని ఖానాపూర్ మండల ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది సూచించారు. ఖానాపూర్ మండలంలోని కొత్తపేట, దేశీనాయక్ తండా గ్రామాలలో ఉన్న అంగన్వాడి కేంద్రాలలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు వారు వ్యాక్సినేషన్ వేశారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని వారు సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు.