ఖానాపూర్ లో భారీ వర్షం నమోదు

74చూసినవారు
ఖానాపూర్ పట్టణంలో భారీ వర్షం నమోదయింది. 3 రోజులపాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఖానాపూర్ పట్టణంతో పాటు పరిసర గ్రామాలలో భారీ వర్షం పడింది. దీంతో ఉదయం నుండి ఎండ తీవ్రతతో బాధపడ్డ ప్రజలకు చల్లటి వాతావరణం ఆహ్లాదాన్ని కలిగించింది. అయితే భారీ వర్షాలతో ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జన్నారం మండలంలో కూడా వర్షం పడింది.

సంబంధిత పోస్ట్