పలు మండలాల్లో నమోదైన భారీ వర్షం

66చూసినవారు
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో భారీ వర్షం పడింది. నియోజకవర్గంలోని ఉట్నూర్, జన్నారం రైతుల మండలాల్లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం నమోదయింది. ఉదయం నుండి ఎండ తీవ్రతకు ఇబ్బంది పడ్డ ప్రజలకు భారీ వర్షం చల్లటి వాతావరణాన్ని అందించింది. రాబోయే మూడు రోజుల పాటు నియోజకవర్గంలోని పలు మండలాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడవచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్