కడెం ప్రాజెక్టులో ఉన్న తాజా నీటి వివరాలను అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 690. 37 అడుగుల నీటిమట్టం ఉంది. ఎగువ ప్రాంతాలలో వర్షాలు తగ్గడంతో ప్రాజెక్టులోకి 6941 క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వస్తోంది. 2 గేట్ల ద్వారా కుడి, ఎడమ కాలువలకు, దిగువ గోదావరిలోకి కలిపి ప్రాజెక్టు నుండి సుమారు 10, 545 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని అధికారులు తెలిపారు.