మహిళలను కించపరిచిన బిఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లి మండల నాయకులు డిమాండ్ చేశారు. మహిళలపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. కేటీఆర్ మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.